Share News

పౌరుల సహకారంతోనే నగరాభివృద్ధి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:32 PM

పౌరులు సహకరిస్తే నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, అభివృద్ధి సాధ్యమని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ తెలిపారు. శనివారం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారలుతో సమీక్ష నిర్వహించారు

పౌరుల సహకారంతోనే నగరాభివృద్ధి
అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

పశువులను రోడ్లపై వదిలితే చర్యలు

నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పౌరులు సహకరిస్తే నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, అభివృద్ధి సాధ్యమని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ తెలిపారు. శనివారం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారలుతో సమీక్ష నిర్వహించారు. రహదారులపై పశువుల సంచారం నియంత్రించడం, ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచిన యజమాను లపై చర్యలు తీసుకుంటామన్నారు. పశువులను రహదారులపై వదిలితే గోశాలకు తరలించి, వారం లోపు జరిమానా చరెల్లించి తీసుకోకపోతే యాజమాన్య హక్కులు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలను మూడు రోజుల్లో యజమానులు స్వచ్చం దంగా శుభ్రం చేసుకోకపోతే నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కుక్కల బెడద నివారణకు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఫంక్షన్‌ హల్స్‌, జనసమూహం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హల్స్‌ నిర్వాహకులు మిగిలిన ఆహరాన్ని బహిరంగ ప్రదేశాల్లో పారవేయడంతో కుక్కల బెడద ఎక్కువైం దన్నారు. 119 రకాల నగర పాలక సేవలు పొందేం దుకు పురమిత్ర యాప్‌ను తప్పనిసరిగ్గా డౌన్‌లోడ్‌ చేసుకుని సమస్యలను వెంటనే తెలియజేయాలని కోరారు. అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటి కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్‌, ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు

Updated Date - Nov 22 , 2025 | 11:32 PM