అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:49 AM
నగరంలో వివిధ దశ ల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జూలై12(ఆంధ్రజ్యోతి): నగరంలో వివిధ దశ ల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం గార్గే యపురం డంప్ యార్డులో బయోమైనింగ్ పనులను ఆయన పరిశీ లించారు. కమిషనర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలన్నారు. పారి శుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి సరఫరా మెరు గుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గడియారం ఆసుపత్రి ఆధుని కీకరణ పనులు, శునకాల సంతాన నియంత్రణ ఆపరేషన్లు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంత రం కమిష నర్ పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, బొగ్గుల దస్త గిరిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఏఈ వైష్ణవి పాల్గొన్నారు.