అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:19 AM
నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు.
నగర పాలక కమిషనర్ రవీంద్రబాబు
కర్నూలు న్యూసిటీ, జూన 27(ఆంధ్రజ్యోతి): నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నేషనల్ క్లీన ఎయిర్ ప్రోగ్రామ్(ఎనక్యాప్) పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జాప్యం చేయకుండా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించారు. సుంకేసుల రోడ్డు, మద్దూర్‌నగర్, బి.క్యాంపు పోస్టాఫీసు నుంచి సి.క్యాంపు టీటీడీ కళ్యాణ మండపం వరకు, బి.క్యాంపు విజ్ఞాన మం దిరం ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కమి షనర్ పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, డీఈ ఈ గిరి రాజు, మనోహర్‌రెడ్డి, నరేష్, బిల్డింగ్ సూపర్‌వైజర్ అంజాద్ బాషా పాల్గొన్నారు.