అందరి సహకారంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:11 PM
అందరి సహకారం ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు
కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడాలి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
డోన్ డీడీవో కార్యాలయం ప్రారంభం
డోన్ టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారం ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా అధికారులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉపముఖ్యంత్రి పవన్‌కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. అందులో భాగంగానే డోన్ పట్టణంలోని డీడీవో కార్యాలయాన్ని మంత్రి బీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి అధికారి కష్టపడి పని చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల నిధులు కూడా తిరిగి వెనక్కు వెళ్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఆర్డీవో కేపీ నరసింహులు, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎల్‌డీవో నరసింహారెడ్డి, పంచాయతీరాజ్ డీఈ గంగాధర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రమేష్ కుమార్ రెడ్డి, సీఐలు ఇంతియాజ్ బాషా, సీఎం రాకేష్, ఎస్‌ఐ శరత్ కుమార్ రెడ్డి, కేడీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ డోన్ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు తదితరులు పాల్గొన్నారు.