కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:29 AM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
టీడీపీ మంత్రాలయం ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి
నూతన గ్రామ సచివాలయ నిర్మాణానికి భూమి పూజ
కోసిగి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోల్‌మాన పేట, మూగలదొడ్డి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు జయరాం, శివలింగమ్మ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ముందుగా నూతన పంచాయతీగా ఏర్పడిన కోల్‌మాన పేట గ్రామానికి కూటమి ప్రభుత్వం రూ.32 లక్షలతో భవన నిర్మాణం చేపడుతున్నామనీ, మూగలదొడ్డి గ్రామంలో కూడా రూ.32 లక్షలతో నూతన పంచాయతీ కార్యాలయం భవనం నిర్మిస్తున్నామన్నారు. మూగలదొడ్డి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని 12 పంచాయతీ భవనాలకు రూ.1.28 కోటిని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్లపై కనీసం మట్టి కూడా వేయలేదని, కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ చేపట్టిందన్నారు. మాలపల్లి-ఎమ్మిగనూరు రోడ్డు, కోసిగి నుంచి హాల్వి రోడ్డు, పెద్ద కడుబూరు నుంచి ఆదోని వరకు ప్రధాన బీటీ రోడ్లకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ రంగస్వామి, ఏఈ మాలిక్, మల్లయ్య, ఎంపీడీవో మహబూబ్ బాషా, ఏపీవో కాలిక్, పంచాయతీ కార్యదర్శి అనూరాధ, బీజేపీ మంత్రాలయం ఇనచార్జి విష్ణువర్దన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.