రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:08 AM
రాష్ట్రం అర్థిక ఇబ్బంది లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోం దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
ఇందిరాగాంధీ నగర్‌లో ‘తొలి అడుగు’
కర్నూలు అర్బన, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అర్థిక ఇబ్బంది లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోం దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు. బుధవా రం నగరంలోని ఇందిరాగాంధీ నగర్‌లో ‘తొలి అడుగు’ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి అభివృద్ధి, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘తల్లికి వందనం’ డబ్బులు తల్లుల అకౌంట్లలో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. త్వర లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ మెచ్చుకుం టున్నారన్నారు.