Share News

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

ABN , Publish Date - May 07 , 2025 | 12:42 AM

అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే
నన్నూరులో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు, మే 6(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం నన్నూరు గ్రామ సమీపంలోని రాగమయూరిలోని రెడ్డి సంక్షేమ సంఘం నుంచి మెయిన రోడ్డు వరకు ఉపాధి నిధులు రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు నాయ కులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ పల్లె పండుగ కార్యక్ర మంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాఽధి నిధులతో రూ.1.50 కోటితో సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్లు చేపట్టారన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ లను తప్పకుండా అమలు చేస్తామన్నారు. మండలానికి మరెన్నో పరిశ్ర మలు రాబోతున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసు లు, పంచాయతీరాజ్‌ ఏఈ సురేంద్రనాథ్‌ రెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి, నాయకులు పుసులూరు ప్రభాకర్‌ రెడ్డి, విజయుడు, ఖాజామియా, నాగేశ్వరరెడ్డి, ప్రతాప్‌, ఎల్‌ఐసీ మద్దయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:42 AM