Share News

ఏడాది పాలనలో అభివృద్ధి పరుగులు

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:36 AM

ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని ఎమ్మెల్యే శ్యాం బాబు అన్నారు. మండలంలో బుధవారం అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఏడాది పాలనలో అభివృద్ధి పరుగులు
అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

పత్తికొండలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ, జూన్‌ 11(ఆంఽధ్రజ్యోతి): ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని ఎమ్మెల్యే శ్యాం బాబు అన్నారు. మండలంలో బుధవారం అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా దూదేకొండలో రూ.78 లక్షలతో ఏర్పాటు చేసిన ఇంటింటికి కొళాయి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం పత్తికొండ మార్కెట్‌యార్డు వెనక దారికి నిర్మించిన సీసీ రహదారి, బైపాస్‌ సమీపంలోని బృందావన్‌ కాలనీలో సీసీ రహదా రిని ప్రారంబిచారు. సచివాలయం-1లో విజన్‌ 2047 యాక్ష న్‌ప్లాన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరచి అక్రమార్జనే ధ్యేయంగా ఐదేళ్లు పాలించిందన్నారు. రాష్ట్రంలో అబివృద్ధి ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. అనంతరం అధికారం చేపట్టిన టీడీపీ రాష్ట్రాభివృద్ధే ధ్వేయంగా పనిచేస్తూ ముందుకుసాగుతోం దన్నారు. సీఎం చంద్రబాబు నాయక త్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. పత్తికొండలో దశాబ్ధా లుగా రోడ్లులేని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిం చామని, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇంటింటికీ కొళాయి పథకం అమలు చేస్తున్నామన్నారు. హంద్రీనీవా ద్వారా 68 చెరువులను నీటితో నింపడంతోపాటు టమోటా జ్యూస్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయాభివృద్ధికి హంద్రీ నీవా నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ప్రభుత్వానికి పంపేందుకు నివేదికలు సిద్ధ్దంచేస్తున్నామన్నారు. ఆర్డీవో భరత్‌నాయక్‌, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, తుగ్గలినాగేంద్ర, హోటల్‌ శ్రీనివాసులు, బీటీ గోవిందు, పుండుకూర బ్రహ్మయ్య, తిప్పన్న, దూదేకొండ తిరుమలేష్‌ గౌడ్‌, పరమేశ్వర నాయుడు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం సచివాలయం-1లో ఎమ్మెల్యే తన ఆధార్‌కార్డును ఆప్‌డేట్‌ చేయించుకున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:36 AM