Share News

అభివృద్ధి, సంక్షేమమే సీఎం లక్ష్యం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:12 PM

అభివృద్ధే, సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే సీఎం లక్ష్యం
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

చంద్రబాబుది మూడు దశాబ్దాల దూర దృష్టి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే, సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్ర బాబుది మూడు మూడు దశాబ్దాల దూర దృష్టి అని అన్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌ సభ స్పీకర్‌ నియామకాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఆదిశగా ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అనే చర్చసాగేలా పనిచేశారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా అమరావతి, పోలవరంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలనుకుంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్‌ రెడ్డి సర్వనాశనం చేశాడని మండి పడ్డారు. ఈ సమావేశంలో నాయకులు పెద్ద వెంకటస్వామి గౌడ్‌, పుల్లయ్య చౌదరీ, పరమేష్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:12 PM