అభివృద్ధి, సంక్షేమమే సీఎం ధ్యేయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:16 AM
అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే సీఎం ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
-పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
- ట్రాక్టర్, ఎద్దులబండ్లపై ‘అన్నదాత సుఖీభవ’కు కృతజ్ఞత ర్యాలీ
-రైతుల నుంచి విశేష స్పందన
-ఎమ్మెల్యేను సన్మానించిన మహిళలు
ఓర్వకల్లు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే సీఎం ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌తో కలిసి అన్న దాత సుఖీభవ పథకానికి కృతజ్ఞతగా హుశేనాపురం గ్రామంలో ట్రాక్టర్లు, ఎద్దులబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జాతీయ రహదారి నుంచి సంత మార్కెట్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీకి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా మం జూరైన రూ.90లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు అనంతరం పొదుపులక్ష్మి కార్యాలయానికి వెళ్లి పొదుపు మహిళలతో ముచ్చటించారు. మహిళలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం కొనుగోలు నుంచి పంట విక్రయం వరకు రైతులకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కనీసం రైతులకు గోనెసం చులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు అండగా చంద్ర బాబు అర్హులైన ప్రతి రైతుకు రూ.20వేల సాయం అందిస్తున్నామని హామీ ఇచ్చి నిలబెట్టుకుంటున్నారన్నారు. సుంకేసుల, గోరుకల్లు రిజర్వాయరుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మతులకు రూ.3కోట్లు నిధులు మంజూరు చేస్తే వైసీపీ నాయకులు పర్సంటేజీల పేరుతో పనులు చేయలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.36 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. త్వరలో జరిగే సర్పంచు ఎన్నికల్లో పొదుపు మహిళలకు కేటాయించాలని ఎమ్మెల్యేను మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ నాగిరెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో మధుమతి, జేఈ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌ఐ సునీల్ కుమార్, మాజీ సర్పంచ మల్లెల జ్యోతి, పాణ్యం మార్కెట్ యార్డు చైర్మన గీత, సొసైటీ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.