Share News

ధోబీ ఘాట్లను అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - May 03 , 2025 | 11:28 PM

పట్టణంలోని ధోబీ ఘాట్లను అభివృద్ధి చేయాలని రజక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి కోరారు. ఈ మేరకు శనివారం సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు.

ధోబీ ఘాట్లను అభివృద్ధి చేయాలి
సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సావిత్రి

రజక కార్పొరేషన్‌ చె ౖర్‌పర్సన్‌ సావిత్రి వినతి

ఆదోని టౌన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ధోబీ ఘాట్లను అభివృద్ధి చేయాలని రజక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి కోరారు. ఈ మేరకు శనివారం సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పట్టణంలోని బాలేకులలోని రెండో ధోబీ ఘాట్‌ను రజకులు 90 ఏళ్లుగా వినియోగించుకుంటున్నారని, అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం విచారకరమన్నారు. అలాగే శాంతమల్లప్ప కొండ ప్రాంతంలోని దోబీ ఘాట్‌లోనూ సౌకర్యాలు కల్పించకపోవడంతో రజకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రజకులకు అవసరమైన షెల్టర్లు, షెడ్లను, కట్టలను నీటి కుంటలను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:28 PM