Share News

ఆదోనిని రెండో ముంబైగా మారుస్తాం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:25 AM

: పట్టణాన్ని రెండో ముంబైగా మారుస్తామని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నిరు. సోమవారం మున్సిపల్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆదోనిని రెండో ముంబైగా మారుస్తాం
నాయకులను సన్మానిస్తున్న కార్యకర్తలు

పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధి

ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రమాణం

ఆదోని, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని రెండో ముంబైగా మారుస్తామని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నిరు. సోమవారం మున్సిపల్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనా క్షినాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మీనాక్షినాయుడు మాట్లాడుతూ కార్యకర్తగా ఉంటూ, రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడు ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేయడం హర్షణీయమన్నారు. పార్టీలకతీ తంగా పనిచేస్తేనే ఆదోని అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభ వజ్ఞుడైన మీనాక్షి నాయుడు సహకారంతో తాను కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాన న్నారు. తాను నిధులు తెస్తే 36 మంది వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటే పట్టణం ఎలా అభివృద్ధి చెందుతుని ప్రశ్నిం చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ అవకాశం ఇచ్చారన్నారు. పాత ఓవర్‌ బ్రిడ్జి స్థానంలో నూతన వంతెన నిర్మాణం, తాగు నీటి సమస్య, బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకు, రోడ్లు, డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం పార్టీ నాయకులు, గజమాలతో సన్మానించారు. కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ సావిత్రి, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, గుడిసె కృష్ణమ్మ, ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌, భాస్కర్‌రెడ్డి, రంగస్వామి నాయుడు, భూపాల్‌చౌదరి, విట్టా రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:25 AM