పిల్లల్లో లోపాలను త్వరగా గుర్తించాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:47 AM
చిన్నపిల్లల్లో మానసిక, శారీరక పెరుగుదల లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించాలని జీజీహెచ్ చిన్న పిల్లల విభాగాదిపతి డా.విజయానంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బాలల సత్వర కేంద్రం (డైస్)లో పునరావాస దినోత్సవం నిర్వహించారు.
జీజీహెచ్ పిడియాట్రిక్ విభాగాధిపతి డా. విజయానంద్ బాబు
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లల్లో మానసిక, శారీరక పెరుగుదల లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించాలని జీజీహెచ్ చిన్న పిల్లల విభాగాదిపతి డా.విజయానంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బాలల సత్వర కేంద్రం (డైస్)లో పునరావాస దినోత్సవం నిర్వహించారు. గర్బంతో ఉన్నప్పుడే సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తే పుట్టబోయే శిశువులో వైకల్య లోపాలను అధిగమించవచ్చ న్నారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డా.మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వారికి పూర్తిగా చికిత్స అందించడమే రాష్ట్రీయ బాల ఆరోగ్య స్వాస్త్య కార్యక్రమం ఉద్దేశమన్నారు. పుట్టుకతో వచ్చే జలుబు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, అంగ వైకల్య వ్యాధులకు జిల్లా సత్వర కేంద్రంలో చికిత్సతో పాటు స్పీచ్ థెరపీ వ్యాయమాలు తల్లులకు నేర్పిస్తారన్నారు. డా.జి.శారద, డా.సుహాసిని, డా.శ్రీలత, డా.ఆనంద ప్రకాష్, డా.కృష్ణ, డైస్ చిన్న పిల్లల వైద్యులు డా.సృజన, మేనేజర్ ఇర్ఫాన్, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.