Share News

జంతువుల నుంచి ప్రాణాంతక వ్యాధులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:46 AM

మూగ జీవాలను సంరక్షించుకోవడం మన బాద్యత. లేకుంటే వాటి వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

జంతువుల నుంచి ప్రాణాంతక వ్యాధులు
పశువును పరీక్షిస్తున్న వైద్యురాలు

అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

నేడు ప్రపంచ జూనోసిస్‌ డే

కర్నూలు అగ్రికల్చర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మూగ జీవాలను సంరక్షించుకోవడం మన బాద్యత. లేకుంటే వాటి వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. భయంకరమైన రేబి్‌సవ్యాధి నివారణకు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన లూయి్‌సపార్చర్‌ అనే శాస్త్రవేత్త టీకా మందును 1885 జూలై 6వ తేదీన కనుగొన్నాడు. దీన్ని పురస్కరించుకొని జంతువుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. సాధారణంగా జంతువుల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతను విస్మరిస్తే భయంకరమైన వ్యాధులు వాటికి సంక్రమించి తద్వారా మనుషులకు వ్యాపిస్తాయని పశుసంవర్థకశాఖ జేడీ శ్రీనివాస్‌ తెలిపారు. సాధారణంగా జంతువులకు, వాటి ద్వారా మనుషులకు వైరస్‌, బ్యాక్టీరియా వల్ల వస్తాయని ఆయన చెబుతున్నారు. పశుపోషణ చేస్తున్న రైతులు పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, మొదలైన వాటిని పోషించేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

మనుషులకు సంక్రమించే వ్యాధులు

బ్రూసెల్లా అబార్షన్‌ లేక బ్రూసెల్లామిలిటిన్సిస్‌ అనే బ్యాక్టీరియా వలన బ్రూసెల్లోసిస్‌ అనే వ్యాపిస్తుంది. విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల ద్వారా బర్డ్‌ఫ్లూ అనే వ్యాధి కోళ్లకు వ్యాిపిస్తుంది. ఇది వైరస్‌ వలన సోకే వ్యాధి. పిచ్చికుక్కల ద్వారా భయంకరమైన రేబిస్‌ వ్యాప్తి చెందుతుంది. వైరస్‌ వలన రెండు నుంచి 15 సంవత్సరాల్లోపు పిల్లల్లో పందువల్ల మెదడువాపు వ్యాధి సంక్రమిస్తుంది. ఆంత్రాక్స్‌ (దొమ్మవ్యాధి) అనే వ్యాధి బాసిల్లాస్‌, ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది.

ప్రోటోజోవన్‌ జూనోసిస్‌..

అమీబియాస్‌, జియార్డియాసిస్‌, టాక్సాప్లాస్మోసిస్‌, బాలన్‌డియోసిస్‌, నల్లజ్వరం మొదలగునవి.

బ్యాక్టీరియల్‌ జూనోసిస్‌..

ఇది బ్యాక్టీరియా వలనే కలిగే వ్యాధులు. ముఖ్యంగా ఆంత్రాక్స్‌, బ్రూసెల్లోసిస్‌, క్షయ, ధనుర్వాతం, సాల్మోనెల్లోసిస్‌, లెప్టోస్పైరోసిస్‌ , కోలిబాసిలోసిస్‌ మొదలగునవి.

వైరల్‌ జూనోసిస్‌:

ఇది సూక్ష్మాతి సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఉదాహరణకు పశువులలో మసూచి, మెదడువ్యాపు, పిచ్చికుక్క కాటు, బర్డ్‌ఫ్లూ మొదలగునవి.

ఫంగల్‌ జూనోసిస్‌..

తామర, కాన్‌డియాసిస్‌.

పరాన్నజీవుల ద్వారా కలుగు జూనోసిస్‌..

ఎథినోకోప్టోసిస్‌ , టీనియాసిస్‌, ఫైలేరియాసిస్‌, ఫేషియాథియోసిస్‌, సిస్టోసోమియాసిస్‌, హైడాటిడోసిస్‌, టైకోస్టాంగైలోసిస్‌ మొదలగునవి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పెంపుడు జంతువులకు జూనోసిస్‌ వ్యాధుల రాకుండా కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద వ్యాధినిర్ధారణ ప్రయోగశాలలో వేస్తారు. వ్యాధి సోకిన పశు, పక్షాదులను మనుషులకు దూరంగా ఉంచాలి. మనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

అప్రత్తమంగా ఉండాలి

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులను వైద్యాధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వెంటనే నివారించుకోవచ్చు. జోనోసిస్‌ వ్యాధికి కర్నూలు నగరంలోని పాతబస్టాండు వద్ద ఉన్న పాలి క్లీనిక్‌ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. - మల్దన్న, పశువైద్యాధికారి, నగర పాలక సంస్థ, కర్నూలు.ల

కార్పొరేషన్‌లో అనారోగ్య జంతువులపై అప్రమత్తత

కర్నూలు నగర కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. నగరంలో నానాటికి పెరిగిపోతున్న వీధి కుక్కలను నివారించేందుకు చర్యలు తీసుకున్నాం. పలు కాలనీల్లో అనారోగ్యానికి గురైన గొర్రెలు, కోళ్ల మాంసాన్ని వినియోగదారులకు అందించకుండా చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాస్‌, జేడీ

Updated Date - Jul 06 , 2025 | 12:46 AM