Share News

సిల్వర్‌ సెట్‌కు 15 వరకు గడువు

ABN , Publish Date - May 09 , 2025 | 12:28 AM

సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే సిల్వర్‌ సెట్‌ 2025కు దరఽఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సిల్వర్‌ సెట్‌కు 15 వరకు గడువు

కర్నూలు అర్బన్‌, మే 8(ఆంధ్రజ్యోతి): సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే సిల్వర్‌ సెట్‌ 2025కు దరఽఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిల్వర్‌ సెట్‌ గురించి చాలామంది విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో గడువు పెంచా మని, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్నా రని వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని సూచించారు. సిల్వర్‌ సెట్‌ అర్హత పరీక్ష ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:28 AM