మరో విద్యార్థి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:22 AM
గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఉదయ్ కుమార్ (20) మృతదేహం శుక్రవారం ఉదయం గజ ఈతగాళ్లు నీటి గుంత నుంచి బయటకు తీశారు. గురువారం సెంయిట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎనిమిది మంది జీడీపీ సందర్శనకు వచ్చారు. అ
కసంద్రంలో విద్యార్థుల కుటుంబాలు
గోనెగండ్ల, అక్టోబరు 17(ఆంఽధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఉదయ్ కుమార్ (20) మృతదేహం శుక్రవారం ఉదయం గజ ఈతగాళ్లు నీటి గుంత నుంచి బయటకు తీశారు. గురువారం సెంయిట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎనిమిది మంది జీడీపీ సందర్శనకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు చెన్నారెడ్డి, ఉదయ్‌కుమార్ గల్లంతయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం గురువారమే లభ్యమైంది. ఉదయ్‌కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శుక్రవారం గజ ఈతగాళ్లు మరోసారి గాలింపు చేపట్టగా ఉదయ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులు గోవిందు, రాధ, స్నేహితులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రగా మారిపోయింది తహసీల్దార్ రాజేశ్వరి శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు ను చేరుకొని గత ఈతగాళ్లచే వెతికించడం ప్రారంభించారు. కొద్ది సేపటికే ఉదయ్‌కుమార్ మృతదేహం ఈతగాళ్లకు దొరికింది. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి శవపరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించడానికి వాహనాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ జాలర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రస్ట్ట్ గేట్ల ముందు పెద్ద గొయ్యి ఉందని, అందులో పడితే బతకడం కష్టమని జాలర్లు తెలిపారు. అలాగే ప్రాజెక్టు వెనుక వైపు కూడా చేపల గుంతలు ఉన్నాయని, అక్కడ కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయని జాలర్లు వివరించారు.