ఐరిష్, లైవ్ మస్టర్‌తో ఇబ్బందులు
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:17 AM
కూలీల ఐరిష్ (కంటితో హాజరు) వేసేందుకు ఉపాధి కూలీలు పని చేశాక కూడా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అవినీతిని అరిక ట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో నూతన పద్ధతులు ఐరిష్, లైవ్ మస్టర్లు ప్రవేశ పెట్టింది. కొన్ని సమయాల్లో సిగ్నల్స్ అందకపోవడంతో కూలీలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది
హాజరు వేసేందుకు గంటల సమయం
మండుటెండలో కూలీల అవస్థలు
తుగ్గలి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కూలీల ఐరిష్ (కంటితో హాజరు) వేసేందుకు ఉపాధి కూలీలు పని చేశాక కూడా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అవినీతిని అరిక ట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో నూతన పద్ధతులు ఐరిష్, లైవ్ మస్టర్లు ప్రవేశ పెట్టింది. కొన్ని సమయాల్లో సిగ్నల్స్ అందకపోవడంతో కూలీలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మండలంలో 18,707 జాబ్‌కార్డులు ఉండగా, ఈ ఏడాది 5వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐరిష్ లైవ్ మస్టర్లతో ఒక్కోక్క మస్టర్‌లో పని చేసే కూలీలు ఆన్‌లైన్‌లో లైవ్‌ఫోటో ఐరిష్ తీసుకోవాలంటే అరగంట పడు తుందని, ఒక్కో గ్రామానికి దాదాపు వంద మస్టర్ల ఉంటాయని, దీంతో గంటల తరబడి పని ప్రదేశంలో ఉండాల్సి వస్తోందిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనికి ఉద యం 6 గంటలకు వచ్చామని, మధ్యాహ్నం 1 గంటైనా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. మండుటెం డలో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పాత పద్దతుల్లోనే హాజ రు వేయాలని కూలీలు కోరుతున్నారు.
ఐరిష్‌తో ఇబ్బందులు
ఐరిష్ తీయాలంటే ఒక్కో గ్రూపు వద్ద అరగంట సమయం పడుతుంది. అలా 20 నుంచి 30 గ్రూపుల ఫొటోలు తీయాలంటే నాలుగైదు గంటలు కూలీలు ఎదురు చూడాల్సి వస్తుంది. - బలరాం, మేటీ, గిరిగిట్ల
పాత పద్ధతిలోనే మేలు..
పాత పద్ధతిలో హాజరు వేస్తేనే మేలు. నెట్‌వర్క్ సమస్య ఉంటే ఐరిష్, లైవ్ మస్టర్లు వేయడం ఆలస్యం అవుతోంది. కూలీలు గంటల తరబడి ఉండాలి. - అక్బర్ సీనియర్ మేటీ, చెన్నంపల్లి