Share News

ప్రమాదం అంచున బతుకుబాట

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:04 AM

డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, హొళగుంద మండలంలోని గ్రామాల్లో కూలీలు నిత్యం వ్యవసాయ పనులకు వెళుతుంటారు. అయితే వీరు ప్రయాణించే తీరు ప్రమాదకరంగా ఉండటంతో ఆందోళన కనిపిస్తుంది.

ప్రమాదం అంచున బతుకుబాట
ఆలూరు-చిప్పగిరి ప్రధాన రహదారిలో ట్రాలీ ఆటోల్లో కూలీల ప్రయాణం

ఆదోని, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, హొళగుంద మండలంలోని గ్రామాల్లో కూలీలు నిత్యం వ్యవసాయ పనులకు వెళుతుంటారు. అయితే వీరు ప్రయాణించే తీరు ప్రమాదకరంగా ఉండటంతో ఆందోళన కనిపిస్తుంది. ఒక్కో ట్రాలీ ఆటోలో 30 మంది దాకా కూలీలు ప్రయాణిస్తున్నారు. వాహనం ఏమాత్రం అదుపు తప్పిన ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. కూలి కావాలంటే ఇలా వెళ్లక తప్పడం లేదని కూలీలు అంటున్నారు. పోలీసులు స్పందించి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునేవారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Apr 10 , 2025 | 12:04 AM