Share News

భయానక హైవే

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:50 AM

: చిన్నటేకూరు బస్సు ప్రమాద ఘటనతో పుర్రెలు.. కాలిన మృతదేహాలు.. బాధిత కుటుంబాల రోదనలతో హైవే భయానకంగా తయారైంది. ఘటన విషయం తెలియగానే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. ప్రమాద ఘటన నుంచి బయట పడిన బాధితులు వివరిస్తున్న తీరును అక్కడికి చేరుకున్న వారు వింటున్న సంఘటనలు కనిపించాయి.

భయానక హైవే

కాలిపోయిన మృతదేహాలు

పుర్రెలు.. కాలిన మృతదేహాలు

రోడ్ల వెంట బారులుదీరిన వాహనాలు

ఘటనాస్థలికి చేరుకుంటున్న బాధిత కుటుంబాలు

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): చిన్నటేకూరు బస్సు ప్రమాద ఘటనతో పుర్రెలు.. కాలిన మృతదేహాలు.. బాధిత కుటుంబాల రోదనలతో హైవే భయానకంగా తయారైంది. ఘటన విషయం తెలియగానే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. ప్రమాద ఘటన నుంచి బయట పడిన బాధితులు వివరిస్తున్న తీరును అక్కడికి చేరుకున్న వారు వింటున్న సంఘటనలు కనిపించాయి. బాధిత కుటుంబాలు ఎలా జరిగింది.. మా కుటుంబ సభ్యులను ఎందుకు నిద్ర లేప లేదు.. అంటూ కర్నూలు నగరం నుంచి అక్కడికి చేరుకున్న నెల్లూరుకు చెందిన మాధవి.. మా బంధువులు గోళ్ల రమేష్‌ కుటుంబాన్ని .. లేపి ఉండవచ్చు కదా.. అని హైదరాబాద్‌కు చెందిన అశ్విన్‌ రెడ్డిని అడుగుతూ బాధాతప్త హృదయంతో కనిపించారు. హైదరాబాద్‌కు చెందిన జయంత్‌ కుశ్వహ్‌ మాట్లాడుతూ బస్‌లో చివరికి వెళిఅద్దం పగల కొట్టడంతో మరో పది మందిని కాపాడాను.. కానీ మిగిలిన వారిని కాపాడుకునే క్రమంలో మంటలు క్షణాల్లో బస్‌ను చుట్టుముట్టాయి. డ్రైవర్‌ బస్‌ను నిలిపి వేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. తెల్లవారే సరికి జాతీయ రహదారి పోలీస్‌ పహారాలో ఉంది. జాతీయ రహదారి వన్‌ వేగా సాగింది. రోడ్ల వెంట వాహనాలు బారులు దీరాయి. పోలీసులు, వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను కర్నూలుకు తరలించే ప్రక్రియను చేపట్టారు. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి.

Updated Date - Oct 25 , 2025 | 12:50 AM