ప్రమాదకరంగా బోటు ప్రయాణం
ABN , Publish Date - May 26 , 2025 | 12:09 AM
మండలంలోని నెహ్రూనగర్ సమీపంలోని మూర్వకొండ, అర్లపాడు ఘూట్‌ల నుంచి కృష్ణానదిలో ఇంజన్‌బోటు ప్రయాణాలు యఽథేచ్చగా, ప్రమాదకరంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
పగిడ్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నెహ్రూనగర్ సమీపంలోని మూర్వకొండ, అర్లపాడు ఘూట్‌ల నుంచి కృష్ణానదిలో ఇంజన్‌బోటు ప్రయాణాలు యఽథేచ్చగా, ప్రమాదకరంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వివిద ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో నదీతీర ప్రాతం ప్రయాణికులతో కళకళాడుతోంది. ప్రస్తుతం వివాహాలు, శుభకార్యాలయాలు ఉండటంతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు నదిలో ఇంజన్‌బోటు ప్రయాణాలను సాగిస్తున్నారు. ప్రతి రోజు ఆయా ఘూట్ల వద్ద వందల సంఖ్యలో నదిలో ప్రయాణాలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రల మద్య రోడ్డు మార్గం ద్వారా ప్రయాణాలు చేసేందుకు అధిక సమయం పట్టడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పడవ ప్రయాణంపై ఆధారపడుతున్నారు. బోటు నిర్వాహకులు అనుభవజ్ఞులైన బోటు డ్రైవరులతో పాటు లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే ఇవేమీ పాటించడం లేదు. పైగా పరిమితికి మించి ప్రయాణికులను ఇంజన్ బోట్లలో తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు నదీలో నీటిమట్టం పెరుగుతున్నప్పటికీ నదిలో ప్రయాణాలు కొనసాగించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.