Share News

పొంచి ఉన్న ముప్పు

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:49 AM

పారిశ్రామికవాడ(ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌)లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో ఎప్పుడు ఏం ముచుకొస్తుందోనని పరిశ్రమల యజమానులు, కార్మికులు భయపడుతున్నారు.

పొంచి ఉన్న ముప్పు
ఉద్యానవనం కాదు.. ఇదీ కూటీ ట్రాన్స్‌ఫార్మరే..తగిలితే అంతే.. చేతికి అందేలా..

కల్లూరు పారిశ్రామికవాడలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిచ్చిమొక్కలు, చెత్త

తక్కువ ఎత్తులో ఏర్పాటుతో కార్మికుల ఆందోళన

కల్లూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవాడ(ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌)లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో ఎప్పుడు ఏం ముచుకొస్తుందోనని పరిశ్రమల యజమానులు, కార్మికులు భయపడుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను అభివృద్ధి చేసింది. పరిశ్రమల కోసం స్థలం కేటాయించింది. విద్యుత్‌ సరఫరా చేసేందుకు 180 ట్రాన్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు.

పెరిగిన రహదారుల ఎత్తు..

పారిశ్రామికవాడ ఏర్పడ్డాక రహదారుల ఎత్తు పెరిగింది, అందుకు అణుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెల ఎత్తును పెంచలేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు తగ్గులో ఉండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పలుమార్లు విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.త

రక్షణ కంచె కరువు

పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫా ర్మర్‌లకు రక్షణ కంచె లేదు. పరిశ్ర మల నిర్వాహకులు ట్రాన్స్‌ఫార్మర్‌ పరిసరాల్లో విడిబాగాలు, ఇనుప వస్తువులు పడుస్తున్నారు. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల పక్కన చెత్త, నరికేసిన చెట్ల కొమ్మలు దర్శనమిస్తున్నాయి.

ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటున్నాం

నగరంలోని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సిబ్బంది, అదికారులతో నిర్వహణ చర్యలు తీసుకుంటున్నాం. వినియోగదారులు సమస్యను మాకు తెలియజేస్తే పరిష్కరిస్తాం. - శేషాద్రి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఆపరేషన్స్‌, కర్నూలు.

Updated Date - Nov 02 , 2025 | 12:49 AM