డెయిరీ ఎన్నికలు రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:41 PM
నంద్యాల విజయ పాల డెయిరీలో త్వరలో నిర్వహించబోయే చైర్మన్, డైరెక్టర్‌ల ఎన్నికలను రద్దు చేయాలని బోయలకుంట్ల పాలసేకరణ కేంద్ర డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు.
బోయలకుంట్ల పాల సేకరణ కేంద్రం డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి
నంద్యాల రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నంద్యాల విజయ పాల డెయిరీలో త్వరలో నిర్వహించబోయే చైర్మన్, డైరెక్టర్‌ల ఎన్నికలను రద్దు చేయాలని బోయలకుంట్ల పాలసేకరణ కేంద్ర డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు. విజయ డెయిరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలని కోరుతూ.. ఆదివారం పాడి పరిశ్రమ రైతులతో పాటు డైరెక్టర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతనెలలో నంద్యాలలో విజయ డెయిరీ సర్వసభ్య సమావేశం నిర్వహి స్తున్నట్లు సమాచారం ఇచ్చి కర్నూలులో జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 15 మంది డైరెక్టర్లలో ఐదుగురిని ఎందుకు తొలగిం చారో చెప్పాలని ప్రశ్నించారు. అనవసరంగా డెయిరీ సొమ్మును ఖర్చు చేస్తూ అభివృద్ధి చేశామని, నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. తాలుకా సీఐ ఈశ్వరయ్య, గంగయ్య యాదవ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.