Share News

సైక్లింగ్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:25 AM

సైక్లింగ్‌ ద్వారా శారీరక ధృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ అన్నారు.

సైక్లింగ్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
జెండా ఊపి సైక్లింగ్‌ ర్యాలీ ప్రారంభిస్తున్న ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌

ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌

సైకిల్‌ ర్యాలీ ప్రారంభం

కర్నూలు క్రైం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సైక్లింగ్‌ ద్వారా శారీరక ధృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ అన్నారు. ఆదివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఆదివారం సన్‌ డేస్‌ ఆన్‌ సైకిల్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమై పాత కంట్రోల్‌ రూం కిడ్స్‌ వరల్డ్‌ మీదుగా రాజ్‌విహార్‌ వరకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి జిల్లా పోలీస్‌ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కృష్ణమోహన్‌ విలేకరులతో మాట్లాడారు. సైక్లింగ్‌ ద్వారా పర్యావరణానికి హాని కలగదన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలన్నారు. వ్యాయామాల ద్వారా రోగ నిరోదక శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్‌ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నారాయణ, ఆర్‌ఎ్‌సఐలు, ఏఆర్‌ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:25 AM