Share News

జొన్నను నమిలేస్తున్న కత్తెర పురుగు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:29 PM

జొన్న పైరుపై కత్తెర పురుగు దాడిచేసి నమిలేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, శకునాల, సోమయాజులపల్ల, కొమరోలు, తిప్పాయపల్లె, ఉయ్యాలవాడ, తదితర గ్రామాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు.

జొన్నను నమిలేస్తున్న కత్తెర పురుగు
ఓర్వకల్లు మండలంలో సాగుచేసిన జొన్న పంట

తగ్గుతున్న దిగుబడి

ఆందోళనలో రైతులు

ఓర్వకల్లు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జొన్న పైరుపై కత్తెర పురుగు దాడిచేసి నమిలేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, శకునాల, సోమయాజులపల్ల, కొమరోలు, తిప్పాయపల్లె, ఉయ్యాలవాడ, తదితర గ్రామాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు.

పురుగు ఉధృతి..

గతే డాది ఆశించిన దిగుబడి రాలేదు, అయినా ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. పంట ఏపుగా పెరిగినా, పురుగు ఆకులను తినేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కత్తెర పురుగు జొన్న ఆకులకు రంధ్రాలు చేస్తూ నమిలేస్తోందని, కంకి దశలో పురుగు దాడి చేస్తుండటంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు నివారణకు మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాలేదంటున్నారు.

తీవ్రంగా నష్టపోతున్నాం

జొన్న పంటకు కత్తెర పురుగు సోకడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అధిక దిగుబడి వస్తుందని జొన్న సాగు చేస్తే నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. -కురువ సుంకన్న, రైతు, ఓర్వకల్లు

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

జొన్నలో కత్తెర పురుగు అరికట్టడానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఓరాసిన్‌ కాలార్మి లీటరు నీటికి 3 మి.లీ. మందు కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి. సాగుకుముందే విత్తన శుద్ధి చేస్తే తెగుళ్ల నివారణతో పాటు అధిక దిగుడి సాధించవచ్చు. - మధుమతి, ఏవో, ఓర్వకల్లు

Updated Date - Dec 28 , 2025 | 11:29 PM