నరికేస్తున్నారు.. తరలిస్తున్నారు
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:07 AM
ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటి పరిరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడా లని సూచిస్తుంటే కొందరు అక్రమార్కులు పచ్చని చెట్లను నరికి తరలిస్తున్నారు
హొళగుంద, సెప్టెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటి పరిరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడా లని సూచిస్తుంటే కొందరు అక్రమార్కులు పచ్చని చెట్లను నరికి తరలిస్తున్నారు. హొళగుందతో పాటు ఎల్లార్తి, కోగిలతోట, వందవాగాలి గ్రామాల్లో ఏళ్లుగా ఉన్న పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు నేలకు ఒరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ దందా సాగుతోంది. ఇప్పటికైనా స్పందిం చాలని పర్యావరణ ప్రేమికులు కోరుతు న్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి మధును వివరణ కోరగా విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు.