తల్లికి వందనంలో కోత..
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:45 AM
అవుట్ సోర్సింగ్ ఉద్యోగలకు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని దూరం చేసింది. అలాగే టీడీపీ ప్రభుత్వం సైతం కూడా అదేబాట పట్టడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మొండిచేయి
కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తింపు
ప్రభుత్వంపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం
ఆలూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): అవుట్ సోర్సింగ్ ఉద్యోగలకు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని దూరం చేసింది. అలాగే టీడీపీ ప్రభుత్వం సైతం కూడా అదేబాట పట్టడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
చిరుద్యోగులకు నిరాశ...
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అంతంత మాత్రమే. నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేలకు మించి ఉండదు. అటువంటి చిరుద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతూ అనర్హులుగా చేశారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలకు మాత్రం తల్లికి వందనం పథకాన్ని అమలుచేయ డంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండి పడుతున్నారు. రూ.45వేలకు పైగా జీతాలు తీసుకుంటున్న జూనియర్ లెక్చరర్లు, స్టాఫ్‌నర్సులు, కంప్యూటర్ ఆపరేటర్లు, కస్తూర్బా, ఎంఆర్‌సీలు ఇలా అందరికీ పథకాన్ని అమలుచేసి తమను నిర్లక్ష్యం చేయడంపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆప్కాస్ పేరిట కోత..
గత వైసీపీ ప్రభుత్వం అన్నిశాఖల్లో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ (ఆప్కాస్)ను ఏర్పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అందులోకి మార్పు చేసింది. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లిస్తుండడంతో గత ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు మొదటిసారి మాత్రమే పథకాన్ని అమలుచేసి అనంతరం అనర్హులుగా చేయడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు వర్తింపజేయాలి
గత వైసీపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను దూరం చేసింది. అయితే రూ.45 వేలకు పైగా జీతం తీసుకుం టున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలకు వర్తింపచేసి, అవుట్ సోర్సింగ్ వారకి పథకాన్ని వర్తింపచేయకపోవడం అన్యాయం. మంత్రి లోకేష్ పునరాలోచించాలి. - దాస్, జిల్లా అధ్యక్షుడు, హౌసింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, కర్నూలు