గ్రామాల పారిశుధ్యంలో సీఆర్పీలే కీలకం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:25 PM
గ్రామాల పారిశుధ్యంలో సీఆర్పీలే కీలకం అని ఎంపీడీవో ఉమామహేశ్వర రావు అన్నారు.
ఉయ్యాలవాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామాల పారిశుధ్యంలో సీఆర్పీలే కీలకం అని ఎంపీడీవో ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎల్‌టీసీలో ఆయా మండలాల సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా రీసోర్సు పర్సన దస్తగిరి మాట్లాడుతూ ప్రతి వెయ్యి కుంటుంబాలకు ఒక సీఆర్పీని నియమించి, వారి ద్వారా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రజలకు అవ గాహన కల్పిస్తు న్నామన్నారు. తడిపొడి చెత్తను ఎలా వేరు చేయాలని, వాటిని చెత్త సంపద కేంద్రానికి ఎలా తరలించాలి అన్న దానిపై శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే వర్మీ కంపోస్టు ఎలా తయారు చేయాలన్నది వారికి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ల, రుద్రవరం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి గ్రామాల సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.