శ్రీగిరిపై భక్తజన సందోహం
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:38 PM
అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
శ్రీశైలం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దసరా సెలవులతో పాటు వారాంతం కావడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు వేలసంఖ్యలో శ్రీగిరికి చేరుకున్నారు. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచు కున్న అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనాల ద్వారా భక్తులు మల్లికా ర్జునస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌లో ముందుగా దర ఖాస్తు చేస్తున్న వారికి మాత్రమే వీఐపీ బ్రేక్, స్పర్శ దర్శనాలను కల్పిం చారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.