Share News

శ్రీశైలంలో భక్తుల సందడి

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:07 AM

శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. శని, ఆదివారాలు సెలవురోజులు కావడంతో మల్లన్న క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శ్రీశైలంలో భక్తుల సందడి
స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరిన భక్తులు

శ్రీశైలం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. శని, ఆదివారాలు సెలవురోజులు కావడంతో మల్లన్న క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించుకుని కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు సారెలు సమర్పించుకు న్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనాలకు వీఐపీ టికెట్‌ పొందిన వారికి గంట సమయం, అతి శీఘ్ర దర్శనం వారికి రెండు గంటలు, శీఘ్ర, ఉచిత దర్శనం వారికి కూడా రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. సామాన్య భక్తులకు క్యూలైన్లలో పాలు, మంచినీరు, అలాహరం, పిల్లలకు బిస్కెట్లను అధికారులు అందిస్తున్నారు. 500, 300 టికెట్లు పొందిన భక్తులు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని పొందుతున్నట్లు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వివిధ రకాల పుష్ఫాలతో అలంకరించిన పల్లకిలో స్వామిఅమ్మవార్ల ఉత్సమూర్తులకు షోడషోపచార పూజాధి క్రతువులు జరిపించారు. అనంతరం పల్లకిసేవను నిర్వహించారు.

Updated Date - Dec 22 , 2025 | 12:07 AM