శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:40 PM
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా రద్దీగా మారింది. వారాంతపు సెలవులు పూర్తయినప్పటికీ గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకుంటూనే ఉన్నారు.
అందరికీ అలంకార దర్శనాలు మాత్రమే
ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా రద్దీగా మారింది. వారాంతపు సెలవులు పూర్తయినప్పటికీ గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకుంటూనే ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించుకుని కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలు గంగమ్మకు సారెలు సమర్పించుకున్నారు. భక్తులందరికీ అలంకార దర్శనమే ఉన్నందున వీఐపీ టిక్కెట్టు పొందిన వారికి గంట సమయం, అతి శీఘ్ర దర్శనం వారికి రెండు గంటలు, శీఘ్ర, ఉచిత దర్శనం వారికి కూడా రెండు గంటలకు పైగా ఉభయ దేవాలయాలలో దర్శనాలు ముగిశాయని ఆలయ అధికారులు చెప్పారు. అదే విధంగా 500, 300 టిక్కెట్లు పొందిన భక్తుల ఉచిత లడ్డూ ప్రసాదాన్ని పొందున్నట్లు చెప్పారు. సాయంత్ర కళారాధన వేదికపై కడప తాళ్లపాక అన్నమయ్య జిల్లాకు చెందిన బాలరాజు, పాండురంగ రాజుల బృందం భజనలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి కళాక్షేత్రం వారి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.