Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:23 AM

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామునే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
క్యూలో నిల్చున్న భక్తులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామునే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తెల్లవారుజామునుంచే క్యూలైన్‌లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jun 30 , 2025 | 12:23 AM