Share News

మహానందిలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:53 PM

మహానంది శైవక్షేత్రం గురువారం వేలాదిమంది భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

మహానందిలో భక్తుల రద్దీ
మహానంది కోనేరులో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు

మహానంది, డిసెంబరు 25 (ఆంరఽధజ్యోతి): మహానంది శైవక్షేత్రం గురువారం వేలాదిమంది భక్తుల రద్దీతో కిటకిటలాడింది. సెలవు రోజుతో పాటు సంవత్సరం ముగింపు కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు బుధవారం రాత్రే క్షేత్రానికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని పూల కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ప్రధాన ఆలయాలతో పాటు భారీ నంది విగ్రహాన్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - Dec 25 , 2025 | 11:53 PM