మహానందిలో భక్తుల సందడి
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:13 PM
కార్తీక మాసం పురస్కరించుకొని మహానంది క్షేత్రానికి భక్తుల సందడి నెలకొంది.
రుద్రగుండం కోనేరులో భక్తుల పుణ్యస్నానాలు
మహానంది, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం పురస్కరించుకొని మహానంది క్షేత్రానికి భక్తుల సందడి నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుంచే ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని పూల కోనేర్లలో భక్తులు పుణ్యస్నా నాలు ఆచరించారు. పరమేశ్వరుడి దర్శనం కోసం క్యూలో భక్తులు బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లోని ధ్వజస్తంభం, నాగులకట్ట వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మూడవ సోమవారం మహానంది ఆలయంలో మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఈవో తెలిపారు.