మహానందిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:09 AM
మహానంది క్షేత్రం శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహానందీశ్వరుని దర్శనార్థం కుటుంబ సమేతంగా వేలాది మంది తరలి వచ్చారు.
మహానంది, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రం శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహానందీశ్వరుని దర్శనార్థం కుటుంబ సమేతంగా వేలాది మంది తరలి వచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని కోనేర్లల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. క్యూలో నిల్చొని హరహర మహాదేవ శంభోశంకర అనే శివనామస్మరణతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కాయకర్పూరం సమర్పించారు. అనంతరం నవనంది క్షేత్రాలు వినాయకనంది, గరుడనందీశ్వరుని ఆలయాలను దర్శించుకున్నారు. పరిసరాల్లోని భారీ నంది విగ్రహాన్ని తిలకించి, కుటుంబ సభ్యులతో సంతోషంగా పోటోలు తీసుకున్నారు. కాగా దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం కూడా మహానందిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు.