మహానందిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 05 , 2025 | 12:45 AM
మహానంది క్షేత్రం ఆదివారం వేలాది మంది భక్తులతో నిండిపోయింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద పరమశివుడి దర్శనం కోసం భక్తులు క్యూలో ఉండటం జరిగింది.
మహానంది, మే 4 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రం ఆదివారం వేలాది మంది భక్తులతో నిండిపోయింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద పరమశివుడి దర్శనం కోసం భక్తులు క్యూలో ఉండటం జరిగింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ప్రధాన ఆలయాల్లో క్యూలో నిలబడి మహానందీశ్వరుడికి, కామేశ్వరీదేవికి కాయకర్పూరాలు సమర్పించారు. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఏఈవో యర్రమల్ల మధు తెలిపారు.