Share News

పొలంలో నీరు.. రైతు కన్నీరు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:39 AM

మండలంలో నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురి శాయి. దీంతో పొజొన్న, పత్తి, కంది పొలాల్లో నీరు నిలి చింది. మండలంలో 7,500 హెక్టార్లలో పంటలు సాగు చేశారు

పొలంలో నీరు.. రైతు కన్నీరు
మద్దికెరలో జొన్నపొలంలో నిలిచిన నీరు .. పత్తి పొలంలోనూ ఇంతే..

మద్దికెర మండలంలో ఎడతెరిపి లేని వర్షం

నీట మునిగిన జొన్న, పత్తి పంటలు

మద్దికెర, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురి శాయి. దీంతో పొజొన్న, పత్తి, కంది పొలాల్లో నీరు నిలి చింది. మండలంలో 7,500 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఎడ తెరిపి లేకుండా వర్షాలు పడుతుండటం వల్ల వర్షం నీరు పొలాల్లో నిల్వ ఉండి పంటలు ఎర్రబారుతున్నాయపి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువులు పిచికారీ చేయాలి

ఎడతెరిపి లేని వర్షాలతో పంటల్లో తేమ పెరిగిందని, పంటలు దెబ్బతినకుండా ఎరువులు పిచికారీ చేయాలని ఏవో రవి సూచించారు. మంగళవారం రైతు భరోసా కేంద్రంలో మాట్లాడుతూ పొలాల్లో నిలిచిన నీటిని ముందుగా బయటకు పంపాలన్నారు. అనంతరం 20 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్‌ను చల్లాలన్నారు. అలాగే 13045 రకం ఎరువును ఎకరాకు కిలో చొప్పున పిచికానీ చేయాలని తెలిపారు. తెగుళ్ల నివారణకు కాపర్‌ ఆక్సోప్లోరైడ్‌ లీటరు నీటికి 3 గ్రాములను కలిపి మొక్కలు తడిచేలా పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించవచ్చన్నారు. పత్తిలో రసం పీల్చే పురుగు నివారణకు మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. సిబ్బంది ఆనంద్‌ ఉన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:39 AM