నీట మునిగిన పంటలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:46 PM
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. మండలంలోని కేపీ గుడిసెల, రామలింగాయపల్లె గ్రామాల్లో సాగుచేసిన కాలిఫ్లవర్, కంది, సజ్జ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
తుగ్గలి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. మండలంలోని కేపీ గుడిసెల, రామలింగాయపల్లె గ్రామాల్లో సాగుచేసిన కాలిఫ్లవర్, కంది, సజ్జ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
రూ.90వేలు నష్టం
మూడు ఎకరాల్లో క్యాలీఫ్లవర్ సాగు చేశాను. నర్సరీ నుంచి మొక్కలు తేవడానికి రూ.80వేల ఖర్చు చేశాను. నాటేందకు రూ.10వేలతో కలిపి, మొత్తం రూ.90వేల వరకు నష్టం వాటిల్లింది. - దేవేంద్ర, రైతు, కేపీ గుడిసెల