యార్డుకు పంట ఉత్పత్తులు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:43 PM
: కర్నూలు మార్కెట్ యార్డుకు గురువారం జిల్లా నలు మూలల నుంచి రైతులు పంట ఉత్పత్తులను పెద్ద ఎత్తున తీసుకువచ్చారు.
రైతులు తెచ్చిన మొక్కజొన్న
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డుకు గురువారం జిల్లా నలు మూలల నుంచి రైతులు పంట ఉత్పత్తులను పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. వేరుశనగ 377 క్వింటాళ్లు, ఆముదాలు 1,660, మొక్కజొన్న 452, ఉల్లిగడ్డలు 2,069 క్వింటాళ్లు తీసుకొచ్చారు. అలాగే పూల విత్తనాలు, కందులు, శనగలు, మిర్చి, సజ్జ 120 క్వింటాళ్లను రైతులు అమ్మకానికి తెచ్చారు. దీంతో మార్కెట్ యార్డులో కోలాహలం కనిపించింది. అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నగేష్, శివన్న, ఆల్‌ఫ్రెడ్ తనిఖీ చేశారు. అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాణ్యమైన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించాలని, లేకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.