పంట నష్ట పరిహారం అందించాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:16 AM
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం అందిచాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న, బాలరాజు డిమాండ్ చేశారు.
పెద్దకడబూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం అందిచాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న, బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడబూరులోని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెద్దకడబూరు మండలాన్ని 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించినప్పటికి నేటి వరకు కరువు సహాయక నిధులు, ఇనపుట్ సబ్సిడీ అమలు కాలేదన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి, ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అలాగే టమాట, మిరప, కొర్ర, సజ్జ వేసిన రైతులు కూడా నష్టపోయారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎకరానికి రూ.లక్ష పంటనష్ట పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యర్రమంలో ఐఎ్‌ఫటీయూ నాయకులు బాబు, ఏఐకేఎంఎస్ నాయకులు ఈరన్న, రామాంజనేయులు, గోపాల్, శేఖర్‌లు పాల్గొన్నారు.