Share News

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:38 PM

జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్‌ కేసులు
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో వెంకటరమణ

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీసీ అండ్‌ పీఎస్‌డీటీ యాక్ట్‌-1994సలహా కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లాలో డెకాయ్‌ ఆపరేషన్లు పటిష్టంగా అమలుపరిచి స్ర్తీ నిష్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఐవో సుదర్శన్‌ బాబు, డెమో ఇన్‌చార్జి కె.రవీంద్రనాయక్‌, వైద్యాధికారులు పద్మజ, అరుణజ్యోతి, శ్రావణ్‌కుమార్‌, ఎన్‌జీవోలు డా.రాజశేఖర్‌, పాల్‌రాజారావు, రామారావు, న్యాయవాది మోతీలాల్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:38 PM