నేరాలతో ప్రేమానురాగాలకు దూరం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:36 AM
క్షణికావేశంలో చేసిన నేరాలతో కుటుంబసభ్యుల ప్రేమానురాగాలు కోల్పోతామని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా అన్నారు.
మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా
నంద్యాల క్రైం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో చేసిన నేరాలతో కుటుంబసభ్యుల ప్రేమానురాగాలు కోల్పోతామని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ జైల్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను, జైలు గదులను, వంటశాలను, స్నానపు తదితర గదులను పరిశీలించి సూచనలిచ్చారు. ఖైదీల ఆరోగ్య విష యం, వారి కేసుల వివరాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఆవేశాలకు గురికాకుండా, తప్పుడు పనులకు దూరంగా ఉండాలని ఖైదీలకు సూచించా రు. సబ్‌జైల్ సూపరింటెండెంట్‌కు ఆయన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జైలర్ గురుప్రసాద్‌రెడ్డి, న్యాయవాది నాయక్, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఏపీపీకి సన్మానం
ఏపీపీగా నియమితులైన ఎస్‌ఎన్ రాజేశ్వరరెడ్డిని మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం సన్మానించారు. శాలువా, పూలమాలతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాసులు, అధ్యక్షుడు కె.పుల్లన్న, ప్రధాన కార్యదర్శి వనం శ్రీనివాసులు, న్యాయవాదులు దబ్బల శంకర్, శింగరి జీవన్‌రాజ్ పాల్గొన్నారు.