నేర నియంత్రణే లక్ష్యం..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:47 PM
నేర నియంత్రణే లక్ష్యంగా డ్రోన్ ఆపరేటర్లు పని చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పేర్కొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వహించండి
ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా
డ్రోన్ ఆపరేటర్లతో సమీక్ష
నంద్యాల టౌన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణే లక్ష్యంగా డ్రోన్ ఆపరేటర్లు పని చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విధుల్లో నైపుణ్యాన్ని ఏవిధంగా పెంచుకోవాలో వీడియోలు, ఫొటోల రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సందర్భం ఏదైనా డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచాలన్నారు. పోలీస్ అధికారులు తమకు అంటూ ఓగుర్తింపు వచ్చేలా విధులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.