భ్రమరాంబ దేవికి ఊయల సేవ
ABN , Publish Date - May 30 , 2025 | 11:21 PM
ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైలంలో భ్రమ రాంబ దేవికి శుక్రవారం ఆలయ అర్చకులు ఊయలసేవ నిర్వహిం చారు.
నంద్యాల కల్చరల్ (శ్రీశైలం), మే 30(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైలంలో భ్రమ రాంబ దేవికి శుక్రవారం ఆలయ అర్చకులు ఊయలసేవ నిర్వహిం చారు. లోక కల్యాణార్థం ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పార్చన, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అమ్మవారిని పుష్పాలతో అలంకరించిన ఊయలపై కొలువుదీర్చారు. శైవ మంత్రాల నడుమ అమ్మవారి ఊయలసేవ ఆసాంతం అలరించింది.