Share News

ప్రాణం తీస్తున్న పశువులు

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:45 AM

పట్టణం లో పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ వాహన దారులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆవు లు, ఎద్దులను యజమానులు పట్టించుకోవడం లేదు. వీటిని వదిలేస్తుండటంతో అవి రోడ్లపై తిష్టవేస్తున్నాయి. ఆలూరులో ఇలా రోడ్లపై 50కిపైగానే పశువులు సంచరిస్తున్నాయి.

 ప్రాణం తీస్తున్న పశువులు
7-8-25(గురువారం)న మృతిచెందిన వృద్ధుడు, 31-7-25న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం

ఆలూరులో ప్రధాన రహదారులపై తిష్ఠ

వాహనదారులు, పాదాచారులపై దాడులు

గురువారం ఆవుల దాడిలో వృద్ధుడి మృతి

ఆలూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణం లో పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ వాహన దారులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆవు లు, ఎద్దులను యజమానులు పట్టించుకోవడం లేదు. వీటిని వదిలేస్తుండటంతో అవి రోడ్లపై తిష్టవేస్తున్నాయి. ఆలూరులో ఇలా రోడ్లపై 50కిపైగానే పశువులు సంచరిస్తున్నాయి.

ప్రధాన రహదారిపై తిష్ఠ

మార్కెట్‌ మెయిన్‌ బజార్‌లో ప్రధాన రహ దారిపై తిష్ట వేస్తున్నాయి. దీంతో రోడ్డుపై నడవాలంటేనే పాదాచారులు, వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పశువుల దాడిలో గురువారం ఆలూరుకు చెందిన పద్మనాభదాస్‌(80) అనే వృద్ధుడు మృతిచెందిన విషయం విదితమే. గతంలో పాత బస్టాండులో పశువుల మధ్య పొట్లాట బీభత్సంగా జరిగింది.

గోశాలకు తరలించాలని ఆందోళన

సమస్యను పరిష్కరించాలని పలుమార్లు కోరినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పశువుల దాడిలో వ్యక్తి మృతిచెందడంతో సీపీఎం నాయకులు, ప్రజలు ఆలూరు అంబేడ్కర్‌ కూడలిలో ఆందోళన చేశారు. అధికారులు స్పందించి పశవులను తరలించాలని కోరుతున్నారు.

ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి

పశువులు రోడ్లపై తిష్ట వేశాయని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురిచింది. అప్పుడే అధికారులు స్పందించి వుంటే ఓ నిండు ప్రాణం పోయేది కాదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు, పంచాయతీ అధికారులు సమన్వయం చేసుకుని పశువులను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

గోశాలకు తరలించాలి

రహదారిపై తిష్టవేసిన పశువులను గోశాలకు తరలించాలి. పలుమార్లు ఆందోళన చేసినా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి.

- నారాయణస్వామి, సీపీఎం నాయకుడు

స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించాం

రహదారిపై తిష్టవేసిన పశువులను తీసుకెళ్లాల ని ఇప్పటికే యజమానులను స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించాం. ఇటీవల పశువుల దాడిలో వ్యక్తి మృతిచెందడంతో పంచాయతీ అధికారుల ద్వారా యజమానులకు నోటీసులు జారీ చేయించాం. రేపటిలోగా స్పందించకుంటే యజమానులపై కేసు పెడతాం. - మహబూబ్‌బాషా, ఎస్‌ఐ, ఆలూరు

Updated Date - Aug 10 , 2025 | 12:45 AM