Share News

కోర్టు కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:26 PM

కోర్టు కానిస్టేబుళ్లు నిబద్ధతతో పని చేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు.

కోర్టు కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలి
కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశమైన ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల టౌన్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కోర్టు కానిస్టేబుళ్లు నిబద్ధతతో పని చేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లతో, జిల్లా నేర ఘనంకాల సేకరణ, విశ్లేషణ, నిర్వహణ సంస్థ (డీసీఆర్‌బీ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుళ్లు విధులు, ముఖ్యమైన కేసులో అభియోగ పత్రాలు దాఖలు సీసీ నెంబర్ల, సమన్లు వారెంటులు వాటి అమలు గురించి సూచనలు చేశారు. వీరే కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి కేసుకు సంబంధిచిన పత్రాలు సాక్ష్యాలు సమయానికి కోర్టుకు అందించాలన్నారు. జిల్లాలో ముఖ్యమైన కేసుల్లో తగిన పత్రాలు దాఖలు చేయడం అత్యంత కీలకమని అన్నారు. సీసీ నంబర్లు వీటిపై నిరంతరం పురోగతి, పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కోర్టు సమన్స్‌, బెయిలబుల్‌ వారెంట్లు, ఆమలు విషయంలో ఎటువంటి ఆలస్యం కాకుండా కోర్టు ఆదేశాల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాన్‌బెయిలబుల్‌ కేసుల ప్రధాన్యతను బట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాటి అమలుపై రిపోర్టులు సమర్పించాలని వారికి ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, పింగర్‌ప్రింట్‌ ఎస్‌ఐ భర త్‌కుమార్‌, శ్రీనివాసరావు, కోర్టు లైసనింగ్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:26 PM