Share News

కౌన్సెలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - May 25 , 2025 | 11:58 PM

జిల్లాలో పని చేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు (మేల్‌) కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

కౌన్సెలింగ్‌ ప్రశాంతం
కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌వో శాంతికళ

40 మంది హెల్త్‌ అసిస్టెంట్లకు స్థానాల కేటాయింపు

కర్నూలు హాస్పిటల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పని చేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు (మేల్‌) కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డా.పి.శాంతికళ ఆధ్వర్యంలో 40 మంది ఎంపీహెచ్‌ఏ (ఎం)లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎంపీహెచ్‌ఏ (మేల్‌)లను వెంటనే రిలీవ్‌ చేయాలని, కొత్త స్థానానికి సోమవారం రిపోర్టు చేయాలని డీఎంహెచ్‌వో ఆదేశాలు జారీ చేశారు. శనివారం సీనియారిటీ జాబితాను విడుదల చేసి ఒక్క రోజు వ్యవధిలో అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించడం విశేషం. కర్నూలు అర్బన్‌లో 13 స్థానాలు, ఎమ్మిగనూరు అర్బన్‌లో 2, ఆదోని అర్బన్‌లో రెండు, డెంగీ, మలేరియా ఉన్న ప్రాంతాలను ఎంపీహెచ్‌ఏ (ఎం)లకు కేటాయించారు. మరో 22 పీహెచ్‌సీలకు స్థానాలను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేశారు. ఎంపీహెచ్‌ఏ (మేల్‌)లు పాత స్థానాల నుంచి రిలీవ్‌ అయి కొత్త స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. డీఎంవో ఏ.నూకరాజు, డీఐవో డా.నాగప్రసాద్‌, కార్యాలయ ఏవో కే.అరుణ, ఆఫీసు సూపరింటెండెంట్‌ పత్తికొండ శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్లు లోక్‌సాయి, మధుసూదన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:58 PM