ముగిసిన సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:25 AM
ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్ ఆదివారం ముగిసింది.
కర్నూలు న్యూసిటీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్ ఆదివారం ముగిసింది. ఎస్బీఐ కాలనీలో జరిగిన కౌన్సెలింగ్‌కు కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీకి సంబంధించిన ప్లానింగ్ సెక్రటరీలు, అమ్యూనిటీస్ సెక్రటరీలు హాజరయ్యారు. ప్లానింగ్ సెక్రటరీలు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 157 మంది, రిక్వెస్ట్ చేసుకున్న వారు 22 మంది, అదే విధంగా అమ్యూనిటీస్ సెక్రటరీలు ఐదేళ్లు పూర్తి చేసుకున్నా వారు 170 మంది, రిక్వెస్ట్ చేసుకున్న వారు 20 మంది తమకు కావాల్సిన సచివాలయాల కోసం ఆప్షన్ ఇచ్చారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి, డోన్ కమిషనర్ సుబ్బరాయుడు, గూడూరు కమిషనర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.