Share News

కౌన్సిలర్లు లేని సమావేశం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:06 AM

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి కౌన్లిర్లు గైర్హాజరు కావడంతో సమావేశం బోసిపోయింది.

కౌన్సిలర్లు లేని సమావేశం
బోసిపోయిన కౌన్సిల్‌ హాల్‌

వైసీపీ కౌన్సిలర్ల గైర్హాజరు

ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి కౌన్లిర్లు గైర్హాజరు కావడంతో సమావేశం బోసిపోయింది. గురువారం చైర్‌పర్సన్‌ శాంత అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. అఇయతే టీడీపీకి చెందిన పార్వతి, ఇటీవల బీజేపీకి మద్దతు పలికిన వైసీపీ కౌన్సిలర్లు సురేష్‌, వసీం, చిన్న మాత్రమే హాజరయ్యారు. గంటపాటు వేచి చూసినా సభ్యులు రాకపోవడంతో సమావేశానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చైర్‌పర్సన్‌ శాంత వెళ్లిపోయారు.

నిజాయితీకి నజరానా : చైర్‌పర్సన్‌

తన నిజాయితీకి నజరానాగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని చైర్‌పర్సన్‌ శాంత ఆవేదన వ్యక్తం చేశారు. తన ఛాంబర్‌లో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కకు పెట్టి, తనను పదవి నుంచి దించడమే ధ్యేయంగా వైసీపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని, రాజీనామా చేసి ఓటమిని అంగీకరించేంది లేదని శాంత అన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:06 AM