పరిశ్రమలకు పత్తి వాహనాల క్యూ
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:02 AM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు పత్తి వాహనాలు క్యూ కడుతు న్నాయి.
ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు పత్తి వాహనాలు క్యూ కడుతు న్నాయి. ఖరీఫ్ సీజన్ పత్తి చేతికి రావడంతో విక్రయించేందుకు రైతులు బుధవారం భారీగా తర లివచ్చారు. అద్దె వాహనాల్లో ఆయా గ్రామాల నుంచి లూజు పత్తిని తీసుకురావడంతో ఉద యం టెండర్ వేసుకుని వ్యాపారులు పరిశ్రమలకు తరలించారు. మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న బీఎంబీజీ జన్నింగ్ పరిశ్రమ, ఐశ్వర్య కాటన్స్, ఆర్‌ఆర్‌జీ జిన్నింగ్ పరిశ్రమకు తూకాలు వేసుకుని అన్‌లోడ్ చేసుకోవడానికి వాహనాలు బారులుదీరాయి.