పత్తి క్వింటం రూ. 7,639
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:54 PM
ఆదోనిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు గతవారం స్వల్పంగా పెరిగినా.. మళ్లీ తగ్గాయి.
ఆదోని అగ్రికల్చర్, నవంబరు 01 (ఆంధ్రజ్యోతి) : ఆదోనిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు గతవారం స్వల్పంగా పెరిగినా.. మళ్లీ తగ్గాయి. శనివారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ. 7639 పలికింది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తి ధరలు తక్కువగా ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ యాప్ సాంకేతిక సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ సాంకేతిక సమస్య వల్ల మరుసటి రోజు రావాలని అధికారులు అంటున్నారు. దీంతో విధిలేక తక్కువ ధరకు మార్కెట్‌లో అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి కొనుగోళ్లకు ఇబ్బంది కలగకుండా సీసీఐ పత్తి కొనాలని డిమాండ్ చేస్తున్నారు. 9743 క్వింటాళ్లు విక్రయానికి రాగా వాటి కనిష్ఠం రూ. 4019, మధ్యధరం రూ. 7369, గరిష్ఠంగా రూ. 7639 ధరలకు కొన్నారు.